దర్శకుడు బోయపాటి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. 'వినయ విధేయ రామా' ఫ్లాఫ్ ని 'అఖండ' విజయం చెరిపేసింది. అఖండ మాస్ జాతరకి మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో మళ్ళీ బోయపాటి స్టార్ లైన్ యాక్టివ్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా దాదాపు ఖరారైయింది. ‘సరైనోడు’ తర్వాత బన్నీ బోయపాటి కలయికలో మరో సినిమా వుంటుందని గతంలోనే వినిపించింది. ఇప్పుడు బోయపాటి మళ్ళీ ఫామ్ లోకి రావడంతో లైన్ క్లియర్ అయ్యింది.
అంతేకాదు ఒక స్టోరీ లైన్ ని కూడా ఫిక్స్ చేశారని టాక్. బోయపాటి మార్క్ లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందునున్న కథలో బన్నీ డబుల్ రోల్ అని తెలిసింది. డబుల్ రోల్ లో కథలు సెట్ చేయడంలో బోయపాటి దిట్ట. బాలయ్య కోసం డబుల్ యాక్షన్ ఫార్ములనే వాడుతారు బోయపాటి. సింహ, లెజెండ్, అఖండ .. ఈ మూడు డబుల్ యాక్షన్లే. ఇప్పుడు బన్నీకి కూడా పవర్ ఫుల్ డబుల్ యాక్షన్ లో చూపించాలని ఫిక్స్ అయ్యారు బోయపాటి. స్టోరీ ఐడియా బన్నీకి కూడా నచ్చింది. బన్నీకీ డబుల్ యాక్షన్ కొత్తగా వుంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాపై ప్రకటన వెలువడనుంది.