'సభ్యసమాజం' అనే మాట 'డిజె' ట్రైలర్‌లో బాగా పాపులర్ అయ్యింది. 'దేవుడా', 'బాగోదు' అనే మాటలతో ఆయా సినిమాలకి స్పెషల్ టచ్ ఇచ్చాడు అల్లు అర్జున్. తనదైన డిక్షన్‌తో ఆ మాటలకి అల్లు అర్జున్ అద్దిన గ్లామర్ ఆ పదాల్ని విపరీతమైన పాపులర్ చేసేశాయి. బయట ప్రతీ ఒక్కరే తమ వాడుక పదాల్లో వాటిని చాలా క్యాచీగా చేర్చేసుకున్నారంటే ఆ పదాల పాపులారిటీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పదమే ఇప్పుడు 'సభ్య సమాజం' అంటున్నాడు అల్లు అర్జున్. 'డిజె' సినిమాలో ఇలాంటి పదాలు మరి కొన్ని ఉన్నాయట. వాటన్నింట్లోకీ 'సభ్య సమాజం' మాట గురించి ప్రత్యేకంగా చెప్పాడు అల్లు అర్జున్. అలాగే 'రచ్చస్య.. రచ్చోబ్యహ..' తరహాలో కొన్ని ప్రత్యేకమైన మాటల్ని మూడేసి సార్లు చెప్పడం కూడా స్పెషల్ అని అన్నాడీ స్టైలిష్ స్టార్. సినిమా షూటింగ్ మొత్తం సరదా సరదాగా సాగిపోయిందనీ, చిత్ర యూనిట్ అంతా సినిమా షూటింగ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశామనీ చెబుతున్నాడు అల్లు అర్జున్. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటన చాలా కొత్తగా ఉంటుందనీ, అలా తనని తాను మార్చుకునేందుకు బన్నీ చాలా కష్టపడ్డాననీ చెప్పాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా విజయంపై బన్నీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ నెల 23న 'డీజె' ప్రేక్షకుల ముందుకు రానుంది.