సేవా కార్యక్రమాల పేరుతో పబ్లిసిటీ చేసుకోవడంలో కొందరు సెలబ్రిటీలు ఎప్పుడూ ముందుంటారు. ఇంకొందరు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారుగానీ, పబ్లిసిటీకి దూరంగా వుంటారు. అలాంటి కొద్ది మందిలో పవన్‌కళ్యాణ్ పేరు ముందుంటుంది. బాబాయ్ పవన్‌కళ్యాణ్ బాటలోనే రామ్‌చరణ్ కూడా తనకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఓ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న చరణ్, ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చుని భరించి, ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించాడు. ఇదంతా రామ్‌చరణ్ కొత్త సినిమా 'రంగస్థలం' షూటింగ్ సందర్భంగా వెలుగు చూసింది. తనకు కొత్త జీవితాన్నిచ్చిన చరణ్‌ని కలిసేందుకు వెళ్ళాడు చిన్నారి ధనుష్. ధనుష్‌ని అతని తల్లిదండ్రులు, చరణ్ వద్దకు తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ధనుష్, 'మగధీర' సినిమాలోని డైలాగ్‌ని చెప్పాడు. చరణ్‌కి మద్దులిచ్చాడు కూడా. ధనుష్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు రామ్‌చరణ్. మెగా ఫ్యామిలీ నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలానే జరుగుతూ ఉంటాయి. అయితే అందులో చాలా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తూ ఉంటాయి. అందులోదే ఇది. ప్రస్తుతం చరణ్ చేస్తున్న 'రంగస్థలమ్' సినిమా షూటింగ్ కోనసీమ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.