అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా పెద్ద హిట్ అయ్యింది. భారీ వసూళ్లు సాధించింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి యూ ట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా? అక్షరాలా 200 మిలియన్ వ్యూస్. నమ్మశక్యంగా లేదు కదా. అంతేకాదు, యూ ట్యూబ్‌లో ఓ ఇండియన్ సినిమా ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇదే తొలిసారి. అదీ బన్నీ స్టామినా.
బన్నీకి మలయాళంలో పిచ్చ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన సినిమాలన్నీ అక్కడ విడుదలవుతాయి. మంచి విజయం సాధిస్తాయి. అయితే ఇప్పుడు హిందీలో కూడా బన్నీ సినిమాలకు సరికొత్త క్రేజ్ ఏర్పడింది. వాస్తవానికి చెప్పాలంటే 'సరైనోడు' సినిమా తెలుగు వెర్షన్ కన్నా, హిందీ వెర్షన్‌లో ఇన్ని వ్యూస్ సాధించింది. ఈ కేటగిరిలో యూ ట్యూబ్‌లో ఇదే ఫస్ట్ రికార్డు ఇప్పటికి.
ఇదిలా ఉంటే, తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' హిందీ వెర్షన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే, హిందీలో బన్నీ సినిమాలకు క్రేజ్ పెరిగిపోతోందనిపిస్తోంది. ఇటీవల బన్నీ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు బన్నీకి. కానీ నటన పరంగా కెరీర్‌లోనే బెస్ట్ కాంప్లిమెంట్స్ దక్కించుకున్నాడు బన్నీ ఈ సినిమాకి. యాంగ్రీ సోల్జర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు సూర్యగా బన్నీ.