ఆడియో విడుదల కార్యక్రమాలలో సదరు హీరోల అభిమానులు అత్యుత్సాహం చూపడం సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో నిన్న జరిగిన 'గీత గోవిందం' ఆడియో విడుదల వేడుకలో కూడా ఇటువంటే సంఘటన జరిగింది.
అయితే అత్యుత్సాహం చూపింది విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాదు.. ఆ వేడుకకి ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్. ఆడియో విడుదల అయ్యాక చివరగా అల్లు అర్జున్ మాట్లాడటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఒక ఫ్యాన్ స్టేజ్ పైకి దూసుకొచ్చి అల్లు అర్జున్ కాళ్ళ పై పడిపోయాడు.
ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకి స్టేజ్ పైన ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అని చెప్పొచ్చు. ఏంటయ్యా ఇలా భయపెట్టేసావ్ అంటూనే బౌన్సర్స్ సదరు అభిమాని పైన చేయి చేసుకుంటుంటే వద్దని వారిని వారించి కిందకి పంపించేశాడు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించాడు బన్నీ.
ఏదేమైనా.. అభిమానులు కూడా ఇలాంటి చర్యలకి పాల్పడక పోతే మంచిది.. ఎందుకంటే దీనివల్ల సెక్యూరిటీ వారితో ఇబ్బందుల్లో పడడం అదే సమయంలో తమ హీరోలకి కూడా ఇబ్బంది కలిగించిన వారవుతారు.