ప్రముఖ డాన్స్ కొరయోగ్రాఫర్, దర్శకుడు, హీరో లారెన్స్ రాఘవ మీద శ్రీరెడ్డి తాజాగా ఆరోపణలు చేసింది. 'రెబల్' సినిమా టైంలో హోటల్‌కి పిలిపించి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని లారెన్స్‌పై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై లారెన్స్ కొంత విభిన్నంగా స్సందించాడు. 'ఎప్పటి సినిమా రెబల్.. ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా టైంలో ఏదో జరిగింది అని ఇప్పుడు ఆమెకి గుర్తొచ్చిందా. ఇన్నాళ్ల నుండి ఏం చేసింది? ఆ సినిమా టైంలో ఆమెతో ఆసభ్యంగా ప్రవర్తించడం అనేది అర్ధం పర్ధం లేని ఆరోపణ.' అని లారెన్స్ అన్నాడు.
అంతేకాదు, ఇప్పుడు ఆమెకు నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను. టాలెంట్ ఉంటే నటిగా ప్రూవ్ చేసుకోమనండి. నా దగ్గరకొస్తే, నేనేదో చేస్తాను అని భయపడితే, తన కుటుంబ సభ్యులను కూడా వెంట తెచ్చుకోవచ్చు. కావాలంటే లాయర్‌ని కూడా తీసుకురావచ్చు. ఇదేదీ నేను ఆమెకు భయపడి చెప్తున్నది కాదు. నాపై ఆమె ఆరోపణలు చేసింది కాబట్టి, అవకాశం ఇస్తాను, ఆమెలో టాలెంట్ ఏంటో నిరూపించుకోమనండి..
నాకు ఆడవాళ్లంటే అమితమైన గౌరవం ఉంది. ఇలాంటి అసత్య ఆరోపణలతో ఆ గౌరవానికి భంగం కల్గించొద్దు అని లారెన్స్ ఘాటుగా శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసింది. ఈ స్థాయిలో ఎవరూ స్సందించలేదు. రాఘవ లారెన్స్ కాస్త భిన్నంగా స్పందించి, హీరోయిజం చాటుకున్నాడు.