బన్నీ నుండి సినిమా వచ్చి ఏడాది గడుస్తోంది. కానీ తదుపరి చిత్రం విషయంలో ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడు బన్నీ. ఈ డైరెక్టర్, ఆ డైరెక్టర్ అంటూ టైం వేస్ట్ చేసి ఈ మధ్యనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ మధ్యనే అంటే అనౌన్స్ చేసి కూడా దాదాపు మూడు నెలలు దాటిపోతోంది. కొత్త సంవత్సరంలోనే ఈ సినిమాని పట్టాలెక్కిస్తామని చెప్పిన అల్లు అర్జున్, ఆ డేట్‌ని అలా అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాడు.
సినిమాల్లో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 16 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ రోజైనా అల్లు అర్జున్ నుండి ఫ్రెష్ అప్‌డేట్ వస్తుందేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే మిగిలింది. ఏ అప్‌డేట్ రాలేదు కానీ, ఓపిక పట్టడి.. ఓపిక పట్టండి.. అంటూ చిత్ర నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి రిక్వెస్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. నిజంగానే ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి సహన పరీక్షలా తయారైంది.
సినిమా అనౌన్స్ చేసి ఇన్నాళ్లయినా, ప్రీ ప్రొడక్షన్ పనులనే ఇంకా పూర్తి చేయలేదట. హీరోయిన్ ఎవరో కన్‌ఫామ్ కాలేదు. కథ ఇదట. అదట.. అనే గాసిప్సే కానీ కథ విషయంలోనూ స్పష్టత లేదు. బన్నీ ఎందుకింత నాన్చుతున్నాడు.? అసలీ ఏడాది ప్రధమార్ధంలోనైనా బన్నీ సినిమా పట్టాలెక్కేనా.? చూడాలి మరి.