2007 సంవత్సరం నుండీ 'ముని' సిరీస్‌తో ఆకట్టుకుంటున్నాడు కొరియోగ్రాఫర్ కమ్, యాక్టర్ కమ్ డైరెక్టర్ లారెన్స్ రాఘవ. తాజాగా ఈ సిరీస్‌లో 'ముని 4' (కాంచన 3) రాబోతోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కాంచన 3' ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు లారెన్స్ రాఘవ. ట్రైలర్‌లో లారెన్స్ ముసలి గెటప్‌లో కనిపిస్తున్నారు. మెరిసిన జుట్టు, గెడ్డంతో కనిపిస్తున్నా, స్టైల్‌లో మాత్రం అస్సలు జోరు తగ్గలేదు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, కామన్‌గా హారర్ చిత్రాల్లో ఉండే ఓ బంగ్లా, అందులో దెయ్యం... వణికిపోయే కొన్ని క్యారెక్టర్లు.. అంతకు మించిన కొత్తదనాన్నయితే ఈ ట్రైలర్‌లో ఏమీ చూపించలేదు. కానీ 'నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్' అంటూ రాఘవ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఓవియా, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ నుండీ కంటిన్యూ అవుతున్న కోవై సరళ ఈ పార్ట్‌లో కూడా రాఘవ తల్లి పాత్రలోనే నటిస్తుండడం విశేషం.
ఇదిలా ఉంటే, 'ముని' సిరీస్‌కి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేది లేదట. ఒకటి కాదు రెండు కాదు.. మూడు కాదు నాలుగు కాదు.. పది పార్ట్‌లు వరకూ ముని సిరీస్‌ని రూపొందిస్తూనే ఉంటాడట రాఘవ.12 ఏళ్లలో నాలుగు పార్ట్‌లు తెరకెక్కించాడు. నాలుగో పార్ట్‌కే ముని ముసలోడైపోయాడు మరి.. పది పార్టుల వరకూ అంటే.. కూసింత కష్టమేమో బాస్.. మునికి కొడుకులు, మనవలు, ముని మనవలు కూడా నటించాల్సొస్తుందేమో చూడు బాస్.!