కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రాబోతోందా.? ఈ ప్రశ్నకు అవుననే టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పకునిగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా అల్లు అర్జున్‌తో రూపొందింది.
ఇప్పుడు కొణిదెల బ్యానర్‌లో అల్లు అర్జున్‌తో సినిమాకి రంగం సిద్ధమవుతోందట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడనీ సమాచారమ్. అయితే గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తాయా.? లేకపోతే ఓన్లీ కొణిదెల బ్యానర్‌లోనే ఈ సినిమా నిర్మితమవుతోందా.? అనేది చూడాలి.
రామ్‌చరణ్ తల్లి సురేఖ మేనల్లుడు అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. సో కొణిదెల బ్యానర్‌లో అల్లు అర్జున్ సినిమా అంటే ఆ సినిమాపై ఇంట్రెస్ట్ ఆటోమెటిగ్గా డబుల్ అవుతుంది. కానీ ఇప్పటిదాకా కొణిదెల బ్యానర్‌లో చేసిన, చేస్తున్న రెండు సినిమాలు చిరంజీవితోనే కావడంతో ఈ బ్యానర్‌లో చిరంజీవి తర్వాత నటించబోయే ఇంకో హీరో అల్లు అర్జునే అవుతాడా? అనేది వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే కొణిదెల బ్యానర్‌లో ముచ్చటగా మూడో సినిమా కూడా చిరంజీవితోనే అని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ, చిరంజీవితో చేయబోయే సినిమా అది. నిజానికి చరణ్ హీరోగా కొరటాల శివ సినిమా రావాల్సి ఉంది. కానీ హీరోగా రామ్‌చరణ్ ప్రస్తుతం చాలా బిజీ. సో కొరటాల నెక్ట్స్ సినిమా చిరంజీవితోనే ఉంటుందేమో చూడాలిక.