టాలీవుడ్ మోస్ట్ ఎట్రాక్టివ్ పెయిర్ చై,శామ్ మరోసారి హాట్ హాట్‌గా వార్తల్లో నిలిచారు. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, ఈ జంట పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు.
తాజాగా చైతూ బర్త్‌డే పార్టీ సందర్భంగా ఈ జంట గోవాలో సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అక్కడ బర్త్‌డే ఎంజాయ్‌మెంట్‌లో దిగిన హాట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సమంత, తన భర్త చైతూపై ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడే నెటిజన్స్‌తో పంచుకుంటూంటుంది. అలాగే బర్త్‌డే పార్టీలో చైతూతో తాను గడిపిన మెమరబుల్ మూమెంట్స్‌ని పిక్స్ ద్వారా ట్టిట్టర్‌లో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో సమంత సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. కొంమంది వీరి ప్రేమకు ఫిదా అవుతుంటే, మరికొందరు ఇంత ఘాటు ప్రేమయా అని కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అయినా సమంతకు ఈ నెగిటివ్ కామెంట్స్ ఏమంత కొత్తేమీ కాదు, నేను నా భర్తతో ఎలా ఉండాలో మీరు చెప్పాలా.? అంటూ సింపుల్‌గా రీ కౌంటర్స్ ఇచ్చేసుంది. లేదంటే లైట్‌గా లైట్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ రియల్ జంట ఆన్‌స్క్రీన్ లవ్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వీరిద్దరూ భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తామని చెప్పి గోవాకి చెక్కేశారీ అక్కినేని అందమైన ప్రేమ జంట.