అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు.

మరిన్ని వార్తలు

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియా లోనే టాప్ స్టార్లలో ఒకరిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్యే ఫాల్కన్ అనే ఒక క్యారవ్యాన్ సొంతం చేసుకుని ఇండియా లోనే ఖరీదైన క్యారవ్యాన్ ఉన్న నటుడిగా వార్తల్లోకెక్కాడు మన బన్నీ. ఇప్పుడు ఈ ఫాల్కన్ విషయంలోనే బన్నీకి హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. 2012 మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఎటువంటి వాహనాలకైనా టింట్ (నల్లటి) ఫిల్మ్ అతికించడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించినట్టే అవుతుంది.

 

అబ్దుల్ అజాం అనే హైదరాబాదీ యువకుడు బన్నీ క్యారవ్యాన్ ని హిమాయత్ నగర్ దగ్గర చూసి..దానికి నల్లటి ఫిల్మ్ ఉండడం గమనించి, ఫోటోలు తీసి, ట్విట్టర్ లో పెట్టి సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసాడు. ఇది గమనించిన సైబరాబాద్ పోలీసులు, రిజిస్ట్రేషన్ నంబర్ (TS 09 FG 6666) ఆధారంగా అది బన్నీ క్యారవ్యాన్ అని తేల్చి దానికి 735 రూ. జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పే బన్నీ ఈ విధంగా నడుచుకోవడం పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS