'సాహో'ని శ్రద్ధా ఎందుకు ఒప్పుకుందంటే!

మరిన్ని వార్తలు

ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌గా 'బాహుబలి' సినిమాతో ఖ్యాతి దక్కించుకున్నాడు ప్రబాస్‌. ఆ కీర్తితోనే ఆయన తాజా చిత్రం 'సాహో'లో పలువురు ప్రముఖ బాలీవుడ్‌ తారలు భాగమయ్యారు. అందులో ముఖ్యంగా శ్రద్ధాకపూర్‌ విషయానికి వస్తే, శ్రద్ధా కపూర్‌ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ కూడా. అలాంటిది 'సాహో'లో నటించేందుకు ఒప్పుకుంది. అందుకు కారణం ఈ సినిమాలో ఆమె కోసం డిజైన్‌ చేసిన క్యారెక్టరే. దాదాపు హీరోతో ఈక్వెల్‌గా ఉండే క్యారెక్టరట అది.

 

యాక్షన్‌ సీన్స్‌ చూస్తుంటే, హాలీవుడ్‌ మూవీస్‌లోని హీరోయిన్స్‌కున్నంత ప్రాధాన్యత కనిపిస్తోంది శ్రద్ధా కపూర్‌ పాత్రలో. ఇంతవరకూ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాల్లో ఎక్కడా శ్రద్ధాని తక్కువ చేసి చూపలేదు. మొన్న విడుదలైన రొమాంటిక్‌ స్టిల్‌ కాక, తాజాగా ఇంకో పోస్టర్‌ వదిలారు 'సాహో' నుండి. ఇది యాక్షన్‌ మోడ్‌. ఈ యాక్షన్‌ మోడ్‌లోనూ ప్రబాస్‌తో పాటు, శ్రద్ధా కూడా కనిపిస్తోంది.

 

ఇద్దరూ గన్స్‌ పట్టుకుని ప్రత్యర్ధుల్ని వీర లెవల్లో షూట్‌ చేస్తున్న స్టిల్‌ ఇది. ఈ స్టిల్‌ని పర్‌ఫెక్ట్‌గా డిజైన్‌ చేశారు. ఫ్యాన్స్‌కి ఈ స్టిల్‌ బాగా కిక్కెక్కిస్తోంది. సినిమా ఆగస్ట్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాప్‌లో సినిమాపై హైప్‌ తీసుకొచ్చేందుకు 'సాహో' టీమ్‌ కొత్త స్ట్రాటజీ ప్లాన్‌ చేస్తోందట. కంటిన్యూస్‌గా 'సాహో' వార్తల్లో నిలిచేలా ఏదో ఒక మ్యాజిక్‌ చేయబోతోందని తెలుస్తోంది. ఆ మ్యాజిక్‌ ఏంటో ముందు ముందు చూడబోతున్నామట. సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS