బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న హాట్ బ్యూటీ!

By iQlikMovies - July 26, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

స్టార్ మా ఛానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా రియాలిటీ షో బిగ్ బాస్ జులై 21న మొదలై అందరి అంచనాలను అందుకుంది. గత రెండు సీజన్ల కంటే భారీగా కొత్తగా ఈ సీజన్ ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. టి.ఆర్.పి మరియు బజ్ లో గత సీజన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 3 మొదలై మూడు రోజులే అయినా అప్పుడే వివాదాలతో హాట్ టాపిక్ గా మార్చేశారు హౌస్ లోని కంటెస్టెంట్స్.

Image

నటి హేమ మానిటర్ గా ఆరుగురు ఎలిమినేషన్ లిస్టులో కూడా చేరారు. ఈ షో ని ఇంకా ఇంటరెస్టింగ్ గా మార్చేందుకు ఇంకాస్త గ్లామర్ యాడ్ చేస్తూ ఈ వారం ఇంకో హాట్ బ్యూటీని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోనికి పంపేందుకు ఫ్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. ఆ బ్యూటీ ఎవరో కాదు శ్రద్ధ దాస్. ఈ వార్త నిన్నటి నుంచి నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ హాట్ బ్యూటీ ఎంట్రీ తరువాత షో లో ఇంకెన్ని ట్విస్టులు, గొడవలు మొదలవుతాయో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS