గీతా ఆర్ట్స్ అంటే... మెగా హీరోల కోసమే కాదు. బయటి హీరోల కోసం కూడా. నాగచైతన్య, నాని లకు సూపర్ హిట్లు అందించింది గీతా ఆర్ట్స్. ఇప్పుడు అఖిల్ బాధ్యతనీ గీతా ఆర్ట్స్ తీసుకుంది. అఖిల్ తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమా చేసింది గీతా ఆర్ట్స్. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సింది. కరోనా వల్ల.. ఆగిపోయింది. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందనుకున్నారు. ఇప్పుడు మార్చికి వాయిదా పడింది.
అయితే ఈ సినిమా రషెష్ చూసిన అల్లు అర్జున్.. దర్శకుడిపై ఫైర్ అయినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వరకే అల్లు అరవింద్ .. కొన్ని మార్పులూ, చేర్పులూ సూచించారని, దాన్ని భాస్కర్ పట్టించుకోవడం లేదని, రీషూట్లు చేసినా అవేం సంతృప్తికరంగా రాలేదని తెలుస్తోంది. అందుకే భాస్కర్ని పిలిచి... మళ్లీ క్లాసు తీసుకున్నాడట. ఇప్పుడు ఇంకొన్ని కొత్త మార్పులు చెప్పాడని, అందుకోసం మళ్లీ రీషూట్లు మొదలెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా మార్చికి విడుదల కావాలి. ఈలోగా కావల్సినంత టైమ్ ఉంది. ఎన్ని మార్పులు చేసినా, రీషూట్లు జరిపినా.. ఫైనల్ అవుట్ పుట్ బాగుండాలన్నది అల్లు అరవింద్ ఆలోచన. అందుకే.. ఖర్చు పెరిగినా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదట. మరి అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఈ సినిమా రషెష్ చూసిన అల్లు అర్జున్.. దర్శకుడిపై ఫైర్ అయినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వరకే అల్లు అరవింద్ .. కొన్ని మార్పులూ, చేర్పులూ సూచించారని, దాన్ని భాస్కర్ పట్టించుకోవడం లేదని, రీషూట్లు చేసినా అవేం సంతృప్తికరంగా రాలేదని తెలుస్తోంది. అందుకే భాస్కర్ని పిలిచి... మళ్లీ క్లాసు తీసుకున్నాడట. ఇప్పుడు ఇంకొన్ని కొత్త మార్పులు చెప్పాడని, అందుకోసం మళ్లీ రీషూట్లు మొదలెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా మార్చికి విడుదల కావాలి. ఈలోగా కావల్సినంత టైమ్ ఉంది. ఎన్ని మార్పులు చేసినా, రీషూట్లు జరిపినా.. ఫైనల్ అవుట్ పుట్ బాగుండాలన్నది అల్లు అరవింద్ ఆలోచన. అందుకే.. ఖర్చు పెరిగినా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదట. మరి అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.