`మన్మథుడు 2`, `ఆఫీసర్` సినిమాలతో నాగార్జున బాగా.. వీకైపోయాడు. నాగ్ సినిమా అంటే... ఉండాల్సిన మినిమం బజ్ కూడా ఇప్పుడు ఉండడం లేదు. నాగ్ సినిమా `వైల్డ్ డాగ్`ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈసినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. పబ్లిసిటీ పరంగా.. వీక్ గా ఉంది. అయితే.. ఈసినిమాని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 37 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. నెట్ ఫిక్స్ ఈ సినిమాని 37 కోట్లకు కొనేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
ఈనెల 26న `వైల్డ్ డాగ్`ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నిజానికి ఈసినిమాని సంక్రాంతికే తీసుకొద్దామనుకున్నారు. కానీ సంక్రాంతికి తెలుగులో కొత్త సినిమాల తాకిడి ఉంది. అందుకే.... కాస్త ఆలస్యం అవుతోంది. ఈ సినిమాని థియేటర్లలోనూ విడుదల చేయాలన్న ప్లాన్ వుంది. కానీ.. ఏం జరుగుతుందో చూడాలి. `వెల్డ్ డాగ్`ని హిందీ, తమిళ, మలయాళంలోనూ డబ్ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో, నాగ్ కి వరుసగా రెండు ఫ్లాపులు వచ్చినీ ఈ తరుణంలో.. నాగ్ సినిమాకి ఈ రేట్ రావడం గ్రేటే.