తెలుగులో తొట్టతొలి ఓటీటీ ఫ్లాట్ ఫామ్... ఆహా. ఈ ఓటీటీ ని అట్టహాసంగా ప్రారంభించారు. అయితే పెద్ద సినిమాల్ని కొనడంలో.. ఆహా అశ్రద్ధ చేసింది. దాంతో పాటు వెబ్ సిరీస్ లు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కొన్న చిన్న సినిమాలు హ్యాండ్ ఇచ్చాయి. దాంతో ఆహా.. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి సమయంలోనే నందమూరి బాలకృష్ణ తో `అన్ స్టాపబుల్` కార్యక్రమాన్ని రూపొందించి గ్రాండ్ హిట్ కొట్టింది. అన్ స్టాపబుల్ సూపర్ హిట్ కావడంతో ఆహా మళ్లీ రేసులోకి రాగలిగింది. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్టులతోనే టాక్ షోలు చేయడానికి ఆహా భారీ కసరత్తులు చేస్తోంది.
అందులో భాగంగా అల్లు అర్జున్ తో ఓ టాక్ షోని రూపొందించాలని ఆహా ప్లాన్ చేస్తోంది. ఆహా ఎలాగూ బన్నీదే కాబట్టి.. తను కూడా ఆహాకోసం టైమ్ కేటాయించగలడు. మరోవైపు వెంకటేష్ తో కూడా ఇలాంటి షోని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వెంకటేష్ అనగానే ఆధ్యాత్మిక విషయాలు గుర్తుకు వస్తాయి. ఈ షోకూడా ఆధ్యాత్మిక విషయాలపైనే ఉండబోతోందని సమాచారం. ఇప్పటి వరకూ వచ్చిన టాక్ షోల కంటే భిన్నంగా ఈ రెండు షోలను డిజైన్ చేస్తున్నార్ట. ఇందులో ఒక్కటైనా క్లిక్ అయితే.. ఆహా మరింత స్ట్రాంగ్ గా నిలబడిపోవడం ఖాయం.