‘మెగా’ మూవీలో బన్నీ.. అడిగితే కాదంటాడా?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను చేయబోతున్న సినిమాల లిస్ట్‌ని ప్రకటించేయడంతో, బోల్డన్ని గాసిప్స్‌కి ఆస్కారమేర్పడింది. చిరంజీవి ‘లూసిఫర్‌’ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటోన్న విషయం విదితమే. ఒకవేళ తన సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ అడిగితే, ఆ సినిమాని ఇచ్చేయడానికి సిద్ధమేనని కూడా చెప్పిన మెగాస్టార్‌, ఇంతలోనే ‘సాహో’ పేం సుజీత్‌, ‘లూసిఫర్‌’ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించడం గమనార్హం. అంతే, సరికొత్త గాసిప్స్‌ షురూ అయ్యాయి ఈ కాంబినేషన్‌ గురించి. అల్లు అర్జున్‌, ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌లో ఓ ఇంట్రెస్టింగ్‌ రోల్‌ చేయబోతున్నాడనే గాసిప్‌ పుట్టుకొచ్చింది.

 

అయితే, ప్రస్తుతానికి అది జస్ట్‌ రూమర్‌ మాత్రమేనని అల్లు అర్జున్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఒకవేళ చిరంజీవి గనుక, అల్లు అర్జున్‌ ‘ఆ పాత్ర’ చేయాలని అనుకుంటే, అల్లు అర్జున్‌ ‘నో’ చెప్పే అవకాశాలుండకపోవచ్చు. ఎందుకంటే, అల్లు అర్జున్‌కి మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఎనలేని గౌరవం కదా.! పైగా, మెగాస్టార్‌తో ఆన్‌ స్క్రీన్‌ కన్పించాలని అల్లు అర్జున్‌ తహతహలాడుతుంటాడు. గతంలోనూ ఒకటీ అరా సినిమాల్లో చిరంజీవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు అల్లు అర్జున్‌. ‘లూసిఫర్‌’ సినిమాని సుజీత్‌ డైరెక్షన్‌లో చేయనున్నట్లు చిరంజీవి చెబుతున్నా, ఏమో.. పవన్‌ ఒకవేళ అడిగితే.. చాలా మార్పులు జరగొచ్చు. ప్రస్తుతానికైతే ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ దశలో వుంది చిరంజీవికి సంబంధించినంతవరకు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS