డైరెక్టర్ సుకుమార్-హీరో అల్లు అర్జున్ ల స్నేహం గురించి మనందరికీ తెలిసిందే.
ఇక వీరి స్నేహం ఎటువంటిదంటే, ఒకరికోసం ఒకరు ఏమైనా చేసే అంతలా. సుకుమార్ నిర్మాతగా మారి కుమారి 21F అనే చిత్రం ఆడియో వేడుకకి వచ్చి ఆ చిత్రానికి ఆడియన్స్ లో కావలసినంత హైప్ తెగలిగాడు బన్నీ.
ఇప్పుడు కూడా దాదాపుగా సుకుమార్ కోసం బన్నీ అదే చేయబోతున్నాడు. సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించిన దర్శకుడు అనే చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి బన్నీ ముఖ్య అతిధిగా రానున్నాడట.
ఈ చిత్రం ఆగష్టు 4వ తేదిన విడుదల కానుండగా, ఆ చిత్రానికి సంబందించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాత్రం ఈనెల చివరిలో ఉండబోతుంది.
సో.. మరోసారి తన ఫ్రెండ్ సినిమా కోసం బన్నీ రానున్నాడనమాట!