అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్

మరిన్ని వార్తలు

సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. నాంపల్లి కోర్టు బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబ‌ర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యామిలీతో కలిసి సంధ్యా థియేటర్ కి వెళ్లగా, అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు శ్రీతేజ్ గాయపడి హాస్పటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటనకి  కారణం అయిన బన్నీపై చిక్కడ పల్లి పోలీసులు కేసు ఫైల్ చేసి డిసెంబ‌ర్ 13న అరెస్ట్ చేశారు. పోలీసులు బన్నీని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు.

అల్లు అర్జున్ లీగల్ టీమ్ వెంటనే క్వాష్ పిటిష‌న్‌ వేయగా హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో బన్నీ డిసెంబరు 14 న రిలీజ్ అయ్యాడు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పైనే బన్నీ బయట ఉన్నాడు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియగానే డిసెంబ‌ర్ 27న‌ అల్లు అర్జున్ వ‌ర్చువ‌ల్‌గా నాంపల్లి కోర్టుకు అటెండ్ అయ్యారు. అప్పుడే  బన్నీ లీగల్ టీమ్ రెగ్యుల‌ర్ బెయిల్ కోసం పిటిష‌న్ ఫైల్ చేసారు.  కౌంట‌ర్ ఫైల్ చేయటానికి పోలీసులు టైం అడగటం తో డిసెంబ‌ర్ 30కి విచార‌ణ వాయిదా ప‌డింది. డిసెంబర్ 30న పోలీసులు కౌంట‌ర్ ఫైల్ చేసారు. రెండు వైపులా వాద‌న‌లు ఉన్న కోర్టు జనవరి 3 కి తీర్పుని వాయిదా వేసింది.

నేడు మళ్ళీ విచారణ చేసిన నాంపల్లి కోర్టు బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.  50వేలతో రెండు పూచీక‌త్తులు ఇవ్వాలని, బెయిలుపై ఉన్నా పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని, ప్ర‌తి ఆదివారం చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌రు కావాల‌ని ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీనితో బన్నీకి జైలు గండం తప్పింది. బన్నీ ఫ్యామిలీ అండ్ ఫాన్స్ కి బిగ్ రిలీఫ్ దొరికింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS