బన్నీ కొత్త 'కటింగ్‌' భలేగుంది

మరిన్ని వార్తలు

స్టైల్‌లో రాకింగ్‌ అల్లు అర్జున్‌. అందుకే ఆయనకి స్టైలిష్‌ స్టార్‌ అనే బిరుదునిచ్చాడు. ఆ బిరుదు ఇచ్చింది కూడా మెగాస్టార్‌ చిరంజీవినే. ఆ పేరుకు తగ్గట్లుగానే సినిమా సినిమాకీ తన స్టైల్‌ని చూపిస్తూ ఉంటాడు బన్నీ. తాజాగా బన్నీ నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో మెగా ఫోన్‌ పట్టాడు. అయితే ఈ సినిమాలో బన్నీ న్యూ హెయిర్‌ సైల్‌తో మెప్పించనున్నాడు. 'సరైనోడు' సినిమాలో ఓ స్టైల్‌తో ఆకట్టుకున్న బన్నీ, 'డీజె'తో స్టైల్‌ మార్చాడు. మళ్లీ ఈ సినిమా కోసం న్యూ హెయిర్‌ స్టైల్‌ ట్రై చేశాడు. 

ఈ సినిమాలో బన్నీ ఆర్మీ మేన్‌గా నటిస్తున్నాడు. సాధారణంగానే ఆర్మీ పీపుల్‌ హెయిర్‌ స్టైల్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే స్టైలిష్‌ స్టార్‌ కదా బన్నీ, ఆ స్టైల్‌ని మరింత స్టైల్‌గా కట్‌ చేశాడు. తాజాగా 'బఫేలో వైల్డ్‌ వింగ్‌' అనే ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌కి వెళ్లిన బన్నీ తన న్యూ హెయిర్‌ స్టైల్‌తో దర్శనమిచ్చాడు. మొన్న సమంతా, నాగ చైతన్యల వివాహ రిసెప్షన్‌కీ బన్నీ హాజరయ్యాడు. కానీ అక్కడ అంతగా ఈ స్టైల్‌ ఎలివేట్‌ కాలేదు. కానీ ఇప్పుడు డీటెయిల్డ్‌గా బన్నీ హెయిర్‌ స్టైల్‌ ఫోకస్‌ అయ్యింది. దాంతో ఇప్పుడు అంతా బన్నీ హెయిర్‌ స్టైల్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. రీల్స్‌లోనే కాదు రియల్స్‌లో కూడా స్టైల్స్‌కి యూత్‌ ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. అలా ఇప్పుడు బన్నీ స్టైల్‌ కూడా పాపులర్‌ అయిపోతుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ స్టైల్‌ బయటికి వచ్చినప్పట్నుంచీ రెస్పాన్స్‌ అదిరిపోతోంది. 

ఈ సినిమాలో బన్నీకి జోడీగా ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS