దెయ్యాల్ని నిజంగా చూసింది లేదు కానీ, సినిమాల్లో చూపించే దయ్యాల్ని చూసి ఖచ్ఛితంగా భయపడేవాళ్లం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. దెయ్యం సినిమా అంటే, ముందు గుర్తొచ్చేది కామెడీ. ఖచ్చితంగా దెయ్యం సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంటే అనే ఫీలింగ్ వచ్చేసింది. దానికి కారణం హారర్ కామెడీ చిత్రాల హవా పెరిగిపోవడమే. దాంతో దెయ్యం అంటే భయమే లేదు. పిల్లా, పెద్దా అంతా కలిసి కుటుంబ కథా చిత్రంలా హారర్ మూవీస్‌ని చూసి ఎంజాయ్ చేసేస్తున్నారు. అందుకే మన హీరో సిద్దార్ద్ మళ్లీ గతంలోని దెయ్యాలను గుర్తుకు చేసేలా 'గృహం' సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', బొమ్మరిల్లు' తదితర చిత్రాలతో లవర్ బోయ్‌లా, చాక్లెట్ బోయ్‌లా ముద్దు ముద్దుగా అలరించిన సిద్ధార్ద్ ఇప్పుడు కొంచెం కొత్తగా ఆలోచించాడు. దయ్యం బాట పట్టాడు. ఈ దయ్యం నవ్వించలేదండోయ్. సిద్దూ చెప్పినట్లుగానే నిజంగానే భయపెట్టేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్దార్ద్ దయ్యం భయపెట్టినా కానీ చూసిన ఆడియన్స్‌కి కొత్త థ్రిల్‌ని ఇస్తోంది. అందుకే ఈ సినిమాకి పోజిటివ్ టాక్ వచ్చింది. పోజిటివ్ టాక్‌తో హిట్ వైపుగా పయనిస్తోంది. ఆండ్రియా ఈ సినిమాలో సిద్దూకి జోడీగా నటించింది. దెయ్యం సినిమా కదా. కొంచెం రిలీఫ్ ఉండాలనీ, అమ్మడు తన అందాల విందుతో ఆ రిలీఫ్ దొరికేటట్లు చేసింది. సో ఆ రకంగా కూడా ఈ సినిమాకి రెస్పాన్స్ అదిరిపోతోంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్, జుగుత్సాహకరమైన థ్రిల్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో.
చాలా గ్యాప్ తీసుకుని స్వీయ నిర్మాణంలో రూపొందించిన 'గృహం' సినిమాతో సిద్దూ హిట్ కొట్టేసినట్లే అని మాట్లాడుకుంటున్నారు అంతా. మిళింద్ రౌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.