ఇటీవల ఓ యువ నిర్మాత హఠాన్మరణం చెందడం టాలీవుడ్‌ని షాక్ కి గురి చేసింది. ఆ నిర్మాతకు సంబంధించిన మూడు సినిమాలు ఆగిపోయాయి. దాంతో పాటుగా ఆ నిర్మాతకు ఏకంగా రూ.80 కోట్ల వరకూ అప్పులు ఉన్నాయన్నది ఇండ్రస్ట్రీలో వినిపిస్తున్న టాక్. దాంతో ఆ నిర్మాతకు అన్ని అప్పులేంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫైనాన్సియర్లు.... కోట్ల కొద్దీ చేబదులుగా ఇచ్చారని ఆ మేరకు వాళ్లంతా మునిగిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సదరు నిర్మాత తీసిన సినిమాలన్నీ దాదాపుగా సేఫ్ ప్రాజెక్టులే. ఇప్పుడు చేయబోతున్న సినిమాలకు సైతం మంచి బిజినెస్ జరిగింది. అయినా సరే.. ఇన్ని అప్పులేంటి? అనేది క్వశ్చన్ మార్క్. చనిపోయే నాటికి... ఆ నిర్మాత పేరు మీద స్థిర చరాస్థులు ఏమీ లేవట. ఇది మరింత ఆశ్చర్యపరిచే విషయం. ఇప్పుడు దానికి అసలు కారణం ఇదీ.... అని ఫిల్మ్ నగర్ లో ఓ కొత్త టాక్ వినిపిస్తోంది. అదేంటంటే... ఆ నిర్మాతకు బెటంటింగుల పిచ్చి ఉందని తెలుస్తోంది. ఇటీవల ఐపీఎల్ లో పూర్తిగా మునిగిపోయాడని, దాంతో కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. దాంతో పాటు... కాసినో ఆడి అందులోనూ కోట్లు పోగొట్టుకున్నాడని సమాచారం.
ఈ అప్పుల వల్లే... ఒత్తిడికి గురయ్యాడని, దాంతోనే గుండె పోటు వచ్చిందని కొత్త టాక్ వినిపిస్తోంది. అయితే మరికొందరు ఇది హఠాన్మరణం కాదని, ఆత్మహత్య అని మరో వాదన వినిపిస్తున్నారు. ఏది ఏమైనా ఓ ప్రాణం పోయింది. దాని చుట్టూ కోట్ల రూపాయల వ్యవహారం ముడిపడి వుంది, ఆ ప్రాణమూ రాదు. ఆ అప్పులూ తీరవు.