తేజూ హీరోయిన్‌... బన్నీ కోసం?

మరిన్ని వార్తలు

మెగా హీరోల సినిమాల్లో న‌టించిన క‌థానాయిక‌ల‌కు ఓ సౌల‌భ్యం ఉంటుంది. ఓ హీరోతో న‌టిస్తే ఆటోమెటిగ్గా మ‌రో హీరో సినిమాలో ఛాన్సొస్తుంటుంది. ఇప్పుడు రాశీ ఖ‌న్నాకు అదే జ‌రిగింది. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో `సుప్రీమ్‌`లో మెరిసింది రాశీఖ‌న్నా. ఆ సినిమా హిట్ట‌య్యింది. ఇప్పుడు `ప్ర‌తిరోజూ పండ‌గే`లో తేజూతో మ‌రోసారి క‌ల‌సి న‌టిస్తోంది. ఈలోగా అల్లు అర్జున్ సినిమాలో క‌థానాయిక‌గా ఆఫ‌ర్ అందుకుంది.

 

బ‌న్నీ హీరోగా `ఐకాన్‌` అనే చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా రాశీఖ‌న్నాని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. బ‌న్నీ ప‌క్క‌న రాశీ న‌టించ‌డం ఇదే తొలిసారి. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే `ఐకాన్‌` సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS