రాజశేఖర్ కుమార్తై శివాత్మిక హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమాతోనే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ప్రమోట్ చేస్తుండడం విశేషం. టైటిల్ దగ్గర నుండి తీసుకుంటే, సినిమాకి హీరోయిన్ పాత్ర బలమైనది. ఆ పాత్ర చుట్టూ హీరో పాత్రని డిజైన్ చేశారు. ప్రమోషన్స్‌లో ఎక్కువ మార్కులు శివాత్మిక వైపే పడుతున్నాయి. ప్రచార చిత్రాలన్నీ శివాత్మికకే అనుకూలంగా అనిపిస్తున్నాయి.
సో టోటల్‌గా 'దొరసాని'ని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగానే ప్రమోట్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక సినిమా విడుదలై, హిట్ కొట్టిందంటే, ఫుల్ క్రెడిట్ శివాత్మికకే చెందడం ఖాయమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్ సంగతి పక్కన పెడితే, ప్రచార చిత్రాల్లో చాలా చోట్ల ఆనంద్ దేవరకొండను డామినేట్ చేసేలా ఉంది శివాత్మిక అప్పియరెన్స్. అలా చూసుకున్నా కూడా శివాత్మికకే మార్కులు ఎక్కువ పడుతుండడం సహజంగా అనిపిస్తోంది.
మొత్తానికి డెబ్యూ మూవీ భలే మూవీ పడిందంటూ శివాత్మికకు ప్రశంసలు దక్కుతున్నాయి. విడుదలకు ముందే శివాత్మికకు ఇంతలా ప్రశంసలు దక్కుతుంటే, సినిమా రిజల్ట్ ఏమాత్రం పోజిటివ్‌గా వచ్చినా, టాలీవుడ్‌కి కొత్త భామ దొరికినట్లే. ఇప్పటికే అప్పుడే శివాత్మికకు అవకాశాలు క్యూ కట్టేస్తున్నాయి. ఓ రీమేక్ చిత్రం శివాత్మిక కోసం వెయిటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు, మరికొన్ని ప్రాజెక్టులూ చర్చల దశలో ఉన్నాయట. చూడాలి మరి శివాత్మికకు 'దొరసాని' నిఖార్సయిన హిట్ ఇస్తుందో లేదో.!