ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రజంట్ మహాదశ నడుస్తున్నట్టు ఉంది. అన్నిట్లో తన మార్క్ ఉంటోంది. అన్నిటా నంబరు వన్ గా దూసుకుపోతున్నాడు. రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తూ, పాన్ వరల్డ్ స్థాయిలో ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు. పుష్పతో పాన్ ఇండియా హీరో అవటమే కాదు, నేషనల్ అవార్డు కూడా సాధించాడు. ఈ మూవీతో బన్నీకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఏర్పడ్డారు. కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా బన్నీ హావా నడుస్తోంది.
ఇదివరకే అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ లోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రికార్డ్ సాధించాడు. ఇప్పుడు తన రికార్డుని తానే బ్రేక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించు కున్నాడు.అంటే దాదాపు రెండున్నర కోట్ల మంది అల్లు అర్జున్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. సౌత్ లో ఏ హీరోకి ఇంత ఫాలోయింగ్ లేకపోవటం గమనార్హం. మొదటి స్థానంలో అల్లు అర్జున్ ఉండగా, రెండో స్థానంలో విజయ్ దేవరకొండ, మూడో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. దుల్కర్ సల్మాన్, యశ్, మహేష్ బాబు, ప్రభాస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 8వ స్థానంలో విజయ్ దళపతి ఉన్నాడు.
దీనిపై బన్నీ స్పందిస్తూ తన ఫోటోని షేర్ చేస్తూ థ్యాంక్యూ 25 మిలియన్స్ అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కి క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వెల్ డన్ లెజెండ్ అని కామెంట్ చేశాడు. మెగా ఫాన్స్ బన్నీకి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.