ఉస్తాద్ తో పవన్ కి చిక్కులు

మరిన్ని వార్తలు

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మూవీ టీజర్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కి కొత్త కష్టాలు తెచ్చి పెట్టెలా ఉంది. ఈ టీజర్ రిలీజ్ అయ్యి రెండు రోజులే అయ్యింది కానీ పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. దీనితో  ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్ళింది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందు వలనే, సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు, కానీ ఫాన్స్ కోసం ఉస్తాద్‌ భగత్‌సింగ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గాజు గ్లాస్‌పై చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి, పవన్ శత్రువులకి మాత్రం పదునుగా గుచ్చుకుంటున్నాయి. దీనితో ఎల్లో మీడియా, ఈసీని ప్రశ్నించింది. ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా? చర్యలు తీసుకోరా? అంటూ.      


తొలిసారి ప్రెస్ మీట్ పెట్టిన ఈసీ ముకేష్‌కుమార్ మీనాను మీడియా నిలదీసింది. గాజు గ్లాస్‌పై ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాలో డైలాగ్స్ చెప్పించారని, జనసేన గుర్తు గాజు గ్లాస్ కదా ఇది ఎన్నికల ప్రచారం కిందికి రాదా అని ప్రశ్నించారు. దీని పై స్పందించిన ముఖేష్ కుమార్ మీనా " నేను ఆ వీడియోను చూడలేదు, కాబట్టి దీనిపై కామెంట్ చేయలేను. కానీ గ్లాస్‌ చూపించి దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజింగ్‌ కిందకు వస్తుంది. పొలిటికల్‌ అడ్వర్టైజింగ్‌లపై బ్యాన్ ఏమీ లేదు. కానీ వాటికి కూడా ముందు పర్మిషన్ తీసుకోవాలి" అని స్పష్టం చేసారు.  


ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్‌ కిందకు వస్తే కచ్చితంగా నోటీసు ఇస్తాం. ప్రీ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని చెబుతాం. వాళ్లు ఏ ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేశారో అనేది తెలియదు. దీనిపై ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడే మా దృష్టికి వచ్చింది, మేం చూస్తాం. చూసిన తర్వాత అది ఎలా ఉంది. అందులో ఏం చెప్పారో పరిశీలిస్తాం.  మే కూర్చున్న టేబుల్, మాట్లాడుతున్న మైక్ ఫ్యాన్, సైకిల్ ఇలా రోజు వారీగా వాడే వస్తువులన్నీ ఎన్నికల గుర్తులే. అలాగని అన్నింటికీ ప్రచారం చేస్తున్నారని పరిగణించలేం. కేస్‌ టు కేస్‌ చూడాల్సి ఉంటుంది. ఈసీ తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS