నో గ్యాప్‌ బాస్‌.. అంటోన్న బన్నీ!

మరిన్ని వార్తలు

బాగా గ్యాప్‌ తీసుకున్నట్లున్నావ్‌.. గ్యాప్‌ తీసుకోలా.. వచ్చింది అనే డైలాగ్‌తో బన్నీ నటించిన 'అల వైకుంఠపురములో..' సినిమాకి తొలి టీజర్‌ని వదిలారు. ఈ డైలాగ్‌ ప్రేక్షకులకు సిట్యువేషనల్‌గా సెట్‌ అయ్యేలా ఉండడంతో ఫ్యాన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. బన్నీని అర్ధం చేసుకున్నారు. గ్యాప్‌ తీసుకుంటే మాత్రం అదిరిపోయే హిట్‌ కొట్టాడు 'అల వైకుంఠపురములో..' సినిమాతో. పోజిటిక్‌ టాక్‌తో అన్నిచోట్లా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్స్‌తో వచ్చిన వసూళ్లతోనే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి వచ్చేసిందంటున్నారు.

 

ఇక తొలి రోజే లాభాల బాట పట్టిన సినిమాగా 'అల వైకుంఠపురములో..' బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచింది. ఇకపోతే, తర్వాత బన్నీ, సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. బన్నీ లేకుండానే కొన్ని సీన్స్‌ చిత్రీకరించేస్తున్నాడు సుకుమార్‌. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఇదో ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపొందుతోంది. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందనే సమాచారం ఉంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు కానీ, సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిపోవడంతో, వీలైనంత త్వరలోనే ఈ సినిమా పూర్తి కానుందని తెలుస్తోంది. అన్నట్లు బన్నీ ఇకపై ఇంత గ్యాప్‌ తీసుకోడట. ఫాస్ట్‌గా సినిమాలు చేసేస్తాడట. ఆ క్రమంలోనే సుకుమార్‌ సినిమాని తను లేకుండానే షూటింగ్‌ స్టార్ట్‌ చేయమని సుకుమార్‌కి బన్నీనే సూచించాడని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS