సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం ప్రపంచ వ్యాపతంగా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫామిలీ ఆడియన్స్ మరియు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి నచ్చేలా ఫుల్ కమెర్షియల్ ఎంటర్టెయినర్ గా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని అందించాడు.
ఈ రేంజ్ లో పాజిటివ్ రిపోర్టులు అందుకున్న 'సరిలేరు..' మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. నైజాం లో 8.66 కోట్లు సీడెడ్ లో 4.56 కోట్లు, ఉత్తరాంధ్ర లో 4.44 కోట్లు, కృష్ణా 3.07, గుంటూరు 1.15, ఈస్ట్ 3.35. వెస్ట్ 2.72 మరియు నెల్లూరు లో 1.27 కోట్లు. మొత్తం కలిపి తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్ల షేర్ తో మహేష్ బాబు స్టామినా మరోసారి నిరూపించింది. ఇదే ఊపులో సూపర్ స్టార్ కెరీర్ లో 'సరిలేరు...' ఎన్ని సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.