‘రంగస్థలం’ కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చేశాడు. అసలు సిసలు గోదారి జిల్లా కుర్రోడిలా మారిపోయాడు. అంతే కాదు రాటు దేలిన పల్లెటూరి కుర్రాడిగా అభిమానులతో అద్భుతమైన ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడా వంతు బన్నీకి వచ్చింది. సుకుమార్ సినిమా కోసం బన్నీ కూడా అదే మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే, బన్నీ చిత్తూరు యాసతో కనిపించనున్నాడు. ‘రంగస్థలం’లో చరణ్‌లాగే ఏ సినిమా లో గుబురు గెడ్డంతో కనిపించబోతున్నాడట బన్నీ. అందుకు సంబంధించి ఓ ఫోటో ఈమధ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది కూడా.
ప్రస్తుతం గెడ్డం పెంచే పనిలో బన్నీ, బన్నీ లుక్ ఫైనలైజ్ చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారట. అలాగే, బన్నీ క్యారెక్టర్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశాడట. గతంలో చాలా రకాల మాస్ క్యారెక్టర్స్ పోషించిన బన్నీ, అసలు సిసలు మాస్ లుక్స్‌లో, మాస్ మ్యానరిజమ్స్‌లో కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్‌ని తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోవల్సి వచ్చింది. కేరళలో ఇప్పటికే కొన్ని షూటింగ్ స్పాట్స్‌ని సుకుమార్ సెలెక్ట్ చేసి ఉంచాడు. కరోనా హడావిడి కాస్త తగ్గగానే, షూటింగ్‌కి టీమ్‌ని సంసిద్ధం చేయనున్నాడట. ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మితమవుతోంది.