మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరంలోనే కాకుండా దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే నిలిచిపోయే ఒక మంచి చిత్రాన్ని రంగస్థలం రూపంలో ప్రేక్షకులకి అందించాడు.
ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి కాకముందే రామ్ చరణ్ తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ఆ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నది.
ఇక ఈ చిత్రం ఇంటర్వెల్ లో వచ్చే ఒక కీలక ఫైట్ ని ఈ మధ్యనే చిత్రీకరించారాట. ఈ సన్నివేశమే సినిమా మొత్తంలో కీలకం అని యూనిట్ వర్గాల సమాచారం. ఇంతటి కీలక ఫైట్ ని చరణ్ ఒక్క షెడ్యూల్ లోనే పూర్తి చేసేశాడు.
ఇదంతా గమనిస్తున్న వారు మాత్రం రామ్ చరణ్ చాలా ఫాస్ట్ అయిపోయాడు కదా గురు అని అనుకుంటున్నారు.