స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది. అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో 50 కోట్లు పైగా వసూళ్లు కొల్లగొట్టి, షేర్స్ సాధించి పెట్టిన సినిమాల్లో ఆరో సినిమాగా 'సూర్య' నిలిచింది. ప్రస్తుతం 80 కోట్లు పైనే వసూళ్లు సాధించింది. గతంలో 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి,' 'రుద్రమదేవి', 'సరైనోడు', 'దువ్వాడ జగన్నాధమ్' సినిమాలు ఈ రికార్డు ఖాతాలో ఉన్నాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది.
తొలి ప్రయత్నంలోనే వక్కంతం వంశీ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా తెరకెక్కే ముందే భారీ అంచనాలు నమోదు చేసిన 'నా పేరు సూర్య' విడుదలయ్యాక తొలుత మిక్స్‌డ్ టాక్‌ని అందుకుంది. కానీ ఆ తర్వాత పుంజుకుంది. వసూళ్లలో తనదైన స్టైల్‌లో పరుగు లంఘించుకుంది. అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. సైనికుడి పాత్ర కోసం అల్లు అర్జున్ పడిన కష్టం, తపన అంతా తెరపై స్పష్టంగా కనిపించడంతో, అభిమానులతో పాటు, అభిమానేతరులు కూడా ఈ సినిమాని ఆదరించారు.
అంతేకాక, విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో కూడా అల్లు అర్జున్ ప్రణాళిక వర్కవుట్ అయ్యింది. చరణ్, పవన్ కళ్యాణ్‌లను ప్రమోషన్స్‌కి ఆహ్వానించడంతో మెగా అభిమానులందరినీ తన వైపు తిప్పుకున్నాడు. అది కూడా ఈ సినిమా విజయానికి కారణమైంది. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో జత కట్టింది