ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు ఒకే రోజు కాకుండా ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే అందులో మహానటి చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకి రాగ ఇంకొక చిత్రం మెహబూబా శుక్రవారం వచ్చింది.
ముందుగా మహానటి చిత్రం గురించి మాట్లాడుకుందాం- సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని వస్తున్న చిత్రం అనగానే ప్రేక్షకులు ఒకింత ఆసక్తికి లోన్నవ్వడమే గాక థియేటర్లకి సైతం మొదటి షో నుండే క్యూ కట్టేశారు. అయితే ప్రేక్షకుల నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ముకానివ్వకుండా దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ప్రధాన పాత్రదారులు ముఖ్యంగా కీర్తి సురేష్, సమంతా లు తమ తమ పాత్రలకి జీవంపోశారు అని చెప్పొచ్చు. ఇక ఈ తరంలో తెలుగు సినిమాలలో ఒక క్లాసిక్ ని అందించినవాడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రతిఒక్కరు చూడవలసిన సినిమా అలాగే మహానటి సావిత్రికి ఏఎ చిత్రం నిజమైన నివాళి.
ఇక ఈ వారం విడుదలైన రెండవ చిత్రం- మెహబూబా. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు పూరి జగన్నాధ్ తీసిన చిత్రం ఇది. అంతేకాకుండా ఈ మెహబూబాతో తన కొడుకు ఆకాష్ పూరి ని తెలుగు తెరకి పరిచయం చేశాడు.
అయితే వీరి ప్రయత్నం విఫలమైంది అనే చెప్పాలి. ఈ చిత్రం ద్వారా పూరి జగన్నాధ్ దర్శకుడిగానే కాకుండా ఒక రైటర్ గా కూడా ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ చిత్రం రెండవ భాగం అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుంది. పూరి మార్క్ సినిమాలని ఆయన నుండి ప్రేక్షకులు ఆయన నుండి కోరుకుంటున్న సమయంలో ఆయన నుండి ఇలాంటి ఒక చిత్రం రావడం ఆయన అభిమానులని మరింతగా బాధపెట్టింది అనే చెప్పాలి.
ఇక ఈ వారం విడుదలైన రెండు చిత్రాలలో ఒకటి బ్లాక్ బస్టర్ అవ్వగా ఇంకొకటి ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఇది ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.