'రంగస్థలం' బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన మహేష్‌బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం సక్సెస్ టాక్‌తో రన్ అవుతోంది. మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్‌ని రీచ్ అయ్యిందని అంటున్నారు. ఆల్రెడీ ఓవర్సీస్ మహారాజు అయిన మహేష్‌బాబు ఈ సినిమాతో అక్కడ 2 మిలియన్ డాలర్స్ ఈజీగా దాటేశాడు రెండు రోజులకే.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భరత్ జోరు చూపిస్తున్నాడు. ఇవన్నీ నెక్స్ట్ రాబోయే బన్నీకి టార్గెట్ సెట్ చేశాయనే చెప్పాలి. ఆల్రెడీ 'రంగస్థలం'తో చరణ్ ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా 'భరత్'తో మహేష్ సత్తా చాటుతున్నాడు. ఇక నెక్స్ట్ బన్నీదే ఛాన్స్. బన్నీ కూడా 100కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతోనే బన్నీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఆ సినిమా నిరాశ పరచడంతో రేసులో వెనకబడిపోయాడు. కానీ ఈసారి చేసి చూపించేలానే ఉన్నాడు బన్నీ.
అంతేకాదు, ఆర్జీవీ వివాదంతో మెగా ఫ్యామిలీలో వివాదాలు సద్దుమనిగి అంతా ఒకే మాటపైకి వచ్చారు. ఈ వివాదంలో బన్నీ, మామయ్య పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలవడంతో పాటు, ఫిలిం చాంబర్‌లో పవన్ చేసిన నిరసనకు తాను కూడా హాజరై, పవన్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో, పవన్ అభిమానులకు, బన్నీపై ఉన్న మిస్ ఆండర్‌స్టాండింగ్స్ కూడా పోయాయి. ఇవన్నీ బన్నీకి కలిసొచ్చే అంశాలే.
ఈ తరుణంలో మే 4న విడుదల కానున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా బన్నీకి సక్సెస్ తెస్తుందా? 100 కోట్ల క్లబ్‌లో బన్నీని నిలబెడుతుందా? బన్నీకి అంత స్టామినా ఉందా? అనేది చూడాలిక.