మరి కొన్ని గంటల్లో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌తో హోరెత్తించేస్తోంది చిత్ర యూనిట్. మెగా ఫ్యామిలీని అంతటినీ సినిమా ప్రమోషన్స్ కోసం వాడేశాడు అల్లు అర్జున్.
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో కలిసిపోవడం, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఆడియో ఫంక్షన్‌కి కొత్త ఎట్రాక్షన్ తీసుకురావడం దగ్గర్నుంచి ఈ సినిమాకి చాలా చాలా గుడ్ సైన్స్ తీసుకొచ్చేశాడు. 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' టైంలో మెగా ఫ్యాన్స్ బన్నీపై చాలా గుర్రుమని ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలావరకూ చక్కబడింది. దాంతో 'సూర్య'పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. మరో పక్క ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రాలోనూ 'సూర్య' సినిమా స్పెషల్ షోస్‌కి లేటెస్ట్‌గా అనుమతి కూడా వచ్చేసింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో జరిగిందని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోన్న సమాచారమ్. దాదాపు 80 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. మరో పక్క బన్నీ - అనూ ఇమ్మాన్యుయేల్ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో ఆడియన్స్‌లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్ ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ అట. ఆయన నటన డిఫరెంట్‌గా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
ఏది ఏమైనా సినిమా టాక్ ఏంటనేది తెలియాలంటే కొద్ది గంటలే వెయిట్ చేయాల్సి ఉంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా ప్రివ్యూ షోస్ ద్వారానే టాక్ బయటికి వచ్చే అవకాశం ఉంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.