ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలైన చిత్రాలకి జాతీయ అవార్డులని ప్రకటించడం, వాటిని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందచేయడం చాలాకాలంగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది.
అయితే ఈ సంవత్సరం నుండి ఆ సంప్రదాయానికి కొన్ని మార్పులు జరగనున్నాయి. అదేంటంటే- ఈ నెల మే 6న జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి ప్రస్తుత రాష్ట్రపతి కేవలం ఒక 1 గంట మాత్రమే సమయం కేటాయించినట్టు రాష్ట్రపతి కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. మిగిలిన అవార్డులని మంత్రి స్మృతి ఇరాని అందచేస్తారు అని కూడా తెలియచేసింది రాష్ట్రపతి కార్యాలయం.
దీనితో పాటుగా వచ్చే ఏడాది నుండి కేవలం ఒకే ఒక అవార్డుని రాష్ట్రపతి ప్రధానం చేస్తారు అని ప్రకటించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ పరిణామానికి నిరసనగా జాతీయ అవార్డులని బహిష్కరిస్తున్నాము అని ఇప్పటికే కొందరు ప్రకటించారు.
అవార్డుల ప్రధానోత్సవానికి ఇంకొక మూడు రోజుల సమయమే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.