'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు సినిమా విజయంపై. చాలా కాలం క్రితమే బన్నీ, లగడపాటి శ్రీధర్‌కి హామీ ఇచ్చాడట. ఆయనతో కలిసి సినిమా చేస్తానని. ఆ హామీ ఇప్పటికి నెరవేర్చుకున్నాడు. మొత్తానికి సినిమా చేశాడు.
బన్నీ కోసం లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారట. పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా రూపొందింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, చూస్తున్నంత సేపూ ఆడియన్స్‌ని చూపు తిప్పుకోనీయకుండా చేస్తాయట. సరికొత్త గెటప్‌లో, సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో బన్నీ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. అనూ ఇమ్మాన్యుయేల్ తొలిసారిగా బన్నీతో జత కడుతోంది. ఆర్మీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆర్మీతో పాటు, రొమాంటిక్ ఎలిమెంట్స్, గ్లామర్, రిచ్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్‌గా సెట్ అయ్యాయట.
మే 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతోనే ఉన్నాడు. వక్కంతం వంశీ ప్రముఖ రచయితగా అందరికీ సుపరిచితుడు. తను స్టోరీలు అందించిన చాలా చిత్రాలు విజయవంతమయ్యాయి. తొలిసారిగా ఆయన మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
అందుకే అంచనాలు బాగా ఉన్నాయి. ఇంతవరకూ దర్శకులుగా మారిన రచయితలు సక్సెస్‌లే చవి చూశారు. ఆ లిస్టులో ఇప్పుడు వక్కంతం వంశీ పేరు కూడా చేరుతుందని ఖచ్చితంగా చెబుతున్నారు. నాగబాబు సమర్పణలో ఈ సినిమా విడుదలవుతోంది.