పుష్ప తరవాత మరో ప్రాజెక్టు ఒప్పుకోలేదు అల్లు అర్జున్. తన దృష్టంతా పుష్ప 2పైనే ఉంది. అయితే ఈ సినిమా ఆలస్యమవ్వడంతో.. బన్నీ ఇబ్బంది పడుతున్నాడని టాలీవుడ్ టాక్. ఎప్పుడో జనవరిలో ప్రారంభం కావల్సిన సినిమా ఇది. ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ లేదు. అలాగని సుకుమార్ ని తొందర చేయడం కూడా బన్నీకి ఇష్టం లేదు. ఎప్పుడు వచ్చినా.. ఓ సూపర్ డూపర్ హిట్ తో వస్తే చాలు. అందుకే.. ఈ విషయంలో బన్నీ ఆచి తూచి స్పందిస్తున్నాడు. అలాగని పుష్ప 2 మొదలయ్యేంత వరకూ ఖాళీగా ఉండడం కూడా బన్నీకి ఇష్టం లేదు. అందుకే ఈలోగా.. ఓ చిన్న సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడట.
బన్నీ ఇప్పుడు కథల వేటలో ఉన్నాడు. సింపుల్ లైన్, తక్కువ లొకేషన్లలో, తక్కువ రోజుల్లో పూర్తయ్యే కథ కోసం బన్నీ అన్వేషిస్తున్నాడట. అంటే.. 3 లేదా 4 నెలల్లో ఈ సినిమా పూర్తయ్యిపోవాలి. అలాగని కమర్షియల్ యాంగిల్స్ మిస్ అవ్వకూడదు. అలాంటి కథ ఎవరు చెబుతారా అని ఎదురు చూస్తున్నాడట. మరీ ఆరేడు నెలల సినిమా అయితే.. పుష్ప 2కి లేటయిపోతుంది. అందుకే సుకుమార్ కథ రెడీ చేసేలోగా ఓ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడు. అయితే ఇవన్నీ... పరిస్థితులు అనుకూలిస్తేనే. లేదంటే.. సుకుమార్ స్క్రిప్టు రెడీ చేసే వరకూ వెయిటింగ్ లో ఉండడమే.