'ఆమె'ను 'ఆ' ప్రాక్టీస్‌కి రమ్మన్న ఆ 'డైరెక్టర్‌' ఎవరు?

మరిన్ని వార్తలు

జూనియర్‌ కత్రినా కైఫ్‌గా పేరున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జరీన్‌ ఖాన్‌ త్వరలో టాలీవుడ్‌లో సందడి చేయనుంది. హ్యాండ్‌సమ్‌ హీరో గోపీచంద్‌ తాజా చిత్రం 'చాణక్య'తో జరీన్‌ ఖాన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో జరీన్‌ఖాన్‌ యాక్షన్‌ గాళ్‌గా కనిపించింది.

 

ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం వెల్లడించింది ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో ఓ డైరెక్టర్‌ ఆమెను ముద్దు ప్రాక్టీస్‌ కోసం రూమ్‌కి రమ్మన్నాడట. ఆయన పేరు చెప్పలేదు కానీ, కాస్టింగ్‌ కౌచ్‌ని తానూ ఎదుర్కొన్నానని చెప్పే క్రమంలో జరీన్‌ ఖాన్‌ ఈ విషయం ప్రస్థావించాల్సి వచ్చింది. కత్రినా కైఫ్‌తో లవ్‌ బ్రేకప్‌ అయిన తర్వాత, ఆమెపై కోపంతో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఆమె పోలికలతో ఉన్న జరీన్‌ ఖాన్‌ని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.

 

సల్మాన్‌ ఖాన్‌ అండ దండలతోనే బాలీవుడ్‌లో ఆమె అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలో ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ, గతంలో తో తమిళ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. మంచి అవకాశాలు దక్కితే, సౌత్‌లో మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. వస్తూ వస్తూనే 'చాణక్య'లో యాక్షన్‌ గాళ్‌గా దర్శనమిస్తోన్న అమ్మడు, తనలోని గ్లామర్‌ టాలెంట్‌కి పని చెప్పిందో లేదో తెలియాలంటే, 'చాణక్య' సినిమా చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS