ఈ మధ్య భారతీయ ఉత్పత్తులను వాడాలని, భారతీయ బ్రాండ్లను ప్రోత్సహించాలని జోరుగా ఒక ఉద్యమం నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ కు చాలామంది సెలబ్రిటీలు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా చైనా ఉత్పత్తులను వాడకుండా వాటి స్థానంలో భారతీయ వస్తువులను, భారతదేశంలో తయారైన వాటిని మనం ప్రోత్సహించాలి అంటూ నినదిస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ గత కొన్ని రోజులుగా ఈ విషయంలో తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేపడుతున్నారు.
తాజాగా ఈ విషయంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించడం విశేషం. తమ్ముడు శిరీష్ చేస్తున్న పనిని ప్రశంసిస్తూ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసి, "శిరీష్ ఇది చాలా మంచి కార్యక్రమం భారతీయ ఉత్పత్తులను మాత్రమే వాడాలని ప్రచారం చేయాలని చెప్పడం చాలా గొప్ప ఆలోచన. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. జై హింద్" అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.