‘పుష్ప’ ఫస్ట్‌ లుక్‌: చూపుల్తో చంపేస్తోన్న అల్లు అర్జున్‌

మరిన్ని వార్తలు

సుకుమార్‌ సినిమాల్లో హీరో చాలా కొత్తగా వుంటాడన్నది అందరికీ తెల్సిన విషయమే. రొటీన్‌ సినిమాలకి భిన్నంగా సుకుమార్‌ ఆలోచనలు సాగుతుంటాయి. తన సినిమాల్లో ‘హీరో’ ఎలా వుండాలన్నదానిపై సుకుమార్‌ చేసే కసరత్తులు అత్యద్భుతం. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినా, ‘రంగస్థలం’ సినిమా చేసినా.. సుకుమార్‌ వర్కింగ్‌ స్టైల్‌ సింప్లీ సూపర్బ్‌. ఇప్పుడు సుకుమార్‌ నుంచి మరో సినిమా రాబోతోంది. అల్లు అర్జున్‌తో ఇప్పటికే పలు మార్లు పనిచసిన ఈ స్పెషల్‌ డైరెక్టర్‌, ఈసారి ‘పుష్ప’ అనే టైటిల్‌ పెట్టాడు అల్లు అర్జున్‌ సినిమాకి. టైటిల్‌ సౌండింగ్‌ తొలుత డల్‌గా అన్పించినా, ఆ టైటిల్స్‌ ఆ తర్వాత సృష్టించే ప్రకంపనలు ఎలా వుంటాయో గతం అనుభవాలు చెబుతున్నాయి. సో, ‘పుష్ప’ ముందు ముందు సృష్టించబోయే సంచలనాలు ఓ రేంజ్‌లో వుంటాయన్నది నిర్వివాదాంశం. ఇక, ఫస్ట్‌ లుక్‌ విషయానికొస్తే, అల్లు అర్జున్‌ పుట్టినరోజు నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అత్యద్భుతమైన పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది.

 

టైటిల్‌తోపాటు, అల్లు అర్జున్‌ లుక్‌ని కూడా రివీల్‌ చేశారు. మాసిన గడ్డం.. బాగా పెరిగిన జుట్టు.. ఇంతేనా.? ఇంకా చాలా వున్నాయి. అన్నిటికీ మించి హీరో అల్లు అర్జున్‌ కళ్ళు ఈ పోస్టర్‌కే హైలైట్‌గా మారాయి. చాలా ఇంటెన్సిటీ వుంది ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో. అల్లు అర్జున్‌కి సంబంధించినంతవరకు ఇంతకుముందెన్నడూ చేయని పాత్ర ఇది. నిజానికి, తెలుగు సినీ పరిశ్రమలో ఇంతవరకు ఇలాంటి కథని మనం చూడలేదని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ చెబుతున్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నడవనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS