అల్లు రామలింగయ్య... తెలుగు చిత్రసీమ గర్వించదగిన హాస్య నటుల్లో ఒకరు. హాస్యమనేముంది? అన్ని రకాల పాత్రలూ పోషించిన ధీశాలి ఆయన. అప్పట్లో చిరుని అల్లుడిగా చేసుకుని, చిరు కెరీర్ సవ్యంగా సాగడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణమయ్యారు. అల్లు కుటుంబం చిత్రసీమలో ధీటుగా నిలబడిందంటే.. అదంతా ఆయన వేసిన పునాదే. అల్లు అర్జున్‌కి తాతయ్య అంటే చాలా అభిమానం. వీలున్నప్పుడల్లా ఆయన్ని ఏదో ఓ రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. ఈరోజు.. అల్లు రామలింగయ్య వర్థంతి.
ఈ సందర్భంగా బన్నీ తాతయ్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు. . ‘తాత మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. జీవితంలో చాలా విషయాలు నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కృషి, పట్టుదల, పోరాటాలకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.