అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ అదిరింది. న్యూ ఇయర్ సందర్భంగా అల్లు అర్జున్ కొత్త సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' టీజర్‌ని 'ఫస్ట్ ఇంపాక్ట్' పేరుతో విడుదల చేశారు. చాలా పవర్‌ఫుల్‌గా కట్ చేశారు ఈ ఫస్ట్ ఇంపాక్ట్‌ని. రచయితగా ఎన్నో సక్సెస్‌ఫుల్ స్టోరీలు అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో డైరెక్టర్‌గా కొత్త అవతారమెత్తారు.
ఈ ఫస్ట్ ఇంపాక్ట్‌తోనే వక్కంతం వంశీ అందరి మనసుల్నీ గెలిచేశాడు. మిలిటరీ కాన్సెప్ట్‌తో అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'సరైనోడు' సినిమాలో ఆర్మీ మేన్ అంటాడు కానీ, ఎక్కడా ఆర్మీకి సంబంధించిన ఫ్లేవర్ పెద్దగా కనిపించదు. కానీ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో మాత్రం పక్కా ఆర్మీమేన్‌గా కనిపిస్తున్నాడు. చనిపోవాల్సి వస్తే, బోర్డర్‌లోకెళ్లి చచ్చిపోతా.. అనే డైలాగ్‌ని బట్టి అర్ధమవుతోంది. ఎంత డెడికేటెడ్ ఆర్మీ ఆఫీసర్‌గా అల్లు అర్జున్ నటించనున్నాడో తెలుస్తోంది.
హెయిర్ స్టైల్ దగ్గర్నుంచీ, బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా చాలా కేర్ తీసుకున్నాడు అల్లు అర్జున్. దేశభక్తికి సంబంధించి చాలానే సినిమాలు వచ్చాయి ఇంతవరకూ. అయితే ఈ సినిమా ద్వారా వక్కతం వంశీ ఏం చెప్పదలచుకున్నాడనేదీ టీజర్‌ని చూస్తే అర్ధమయిపోతోంది. ఈ దేశభక్తికి యూత్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అవుతారనిపిస్తోంది. ఇటీవలే 'డీజె'తో డిఫరెంట్ గెటప్ ట్రై చేశాడు బన్నీ. అలాగే ఈ సినిమాతో సూర్య పాత్రలో మిలిటరీ మేన్‌గా సరికొత్త గెటప్‌తో తన ప్రతాపం చూపనున్నాడు. ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ ఫస్ట్ ఇంపాక్ట్ చూశాక అంతా సూర్య పాత్రలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకూ తెలుగు తెరపై ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ హీరోయిజం ఈ సినిమాతో కనిపించబోతోంది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డిక్షన్, ఆ స్టైలింగ్ అన్నీ సింప్లీ సూపర్బ్.