మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించడం అక్కడ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పైన సందర్శించనున్నాడు.
ఆ సందర్భంలో ఆయన నిర్మాత అల్లు అరవింద్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. ఇక ప్రజారాజ్యం పార్టీ విఫలం కావడంలో కొంతమంది ముఖ్యభూమిక పోషించారు అని వాళ్ళెవరో తనకి తెలుసు అని పవన్ అనడం ఆ అంశానికి మరింత ప్రాధాన్యం పెరిగింది.
ఈ తరుణంలో అల్లు అర్జున్ నేటి ఉదయం ఆయన సోషల్ మీడియా ఎకౌంటు లో ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ సెటైర్ వేసే విధంగా ఉంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు మొదలుపెట్టేశారు.
ఇంతకి బన్నీ పెట్టిన పోస్ట్ ఎందుకో అన్నది ఎవరికి తెలియనప్పటికీ అది మాత్రం పవన్ అభిమానుల్లో వేరే విధంగా వెళ్ళింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని కోరగా- 'చెప్పను బ్రదర్' అని అనడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ అంశం కాస్త చివరికి అల్లు అర్జున్ ఒక మనసు ఆడియో వేడుకలో దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మరి ఇప్పుడు ఈ కొత్త అంశం ఏ మలుపు తీసుకోనుందో అన్నది వేచి చూడాలి.