రాజమౌళి కి నచ్చిన సినిమా ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరుని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశాడు. అట్లాంటి దర్శకుడు తను తీసిన చిత్రం కన్నా మరొక చిత్రం తనని బాగా ఇంప్రెస్ చేసినట్టు తెలిపాడు.

ఒక ప్రముఖ వెబ్ మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకి ఈ సంవత్సరంలో విడుదల అయిన చిత్రాలలో తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి బాగా నచ్చింది అని తెలిపాడు. దర్శకుడు సందీప్ చాలా బాగా చిత్రాన్ని తెరకెక్కించాడు అని అలాగే కథని డీల్ చేసిన విధానం తనని బాగా ఆకట్టుకుంది అని చెప్పాడు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో ఒక ట్రెండ్ సృష్టించింది అని అందరు అభిప్రాయపడుతున్న సందర్భంలో రాజమౌళి వంటి దర్శకుడి చేత కూడా ఇది బెస్ట్ చిత్రం అనిపించుకోవడం అర్జున్ రెడ్డి టీంకి మరింత బూస్ట్ ఇచ్చే అంశం.

మొత్తానికి ప్రముఖ దర్శకుల నుండి సామాన్య ప్రజల దాకా అందరి మన్ననలు పొందింది అనే చెప్పాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS