వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కి జవాన్ రూపంలో కొద్దిగా ఉపశమనం దొరికినట్టయింది.
సినిమా పాజిటివ్ టాక్ తో మొదలయినప్పటికి చివరికి ఒక యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్న సాయి ధరం, ఇంకొక చిత్రాన్ని మొదలుపెట్టేశాడు.
వివరాల్లోకి వెళితే, సాయి ధరం తేజ్ - కరుణాకరణ్ కలయికలో వస్తున్న చిత్రం షూటింగ్ ఈరోజే హైదరాబాద్ శివార్ల లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో మొదలయ్యింది. ఈ సినిమాలో సాయి ధరమ్ పక్కన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటించనుంది.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు ఆయన నిర్మాణ సంస్థ అయిన క్రియేటివ్ కమర్షియల్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.