2020 వెళ్లిపోతోంది. ఈ యేడాదంతా చేదు జ్ఞాపకాలే. ఎవరికీ ఏదీ కలసి రాలేదు. సినిమా పరిశ్రమ అంటారా..? అది పూర్తిగా చితికి పోయింది. ఈ యేడాది థియేటర్లలో కంటే, ఓటీటీ వేదికల్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయేమో. ఈ యేడాది వచ్చిన సినిమాల విశ్లేషణ అప్పుడే మొదలైపోయింది. 2020లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల జాబితాని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో రెండు తెలుగు చిత్రాలకు చోటు దక్కింది.
అందులో ఒకటి అల వైకుంఠపురములో అయితే, రెండోది ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య. బన్నీ సినిమా టాప్ 10లో ఉండడం గొప్పేం కాదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఆ సినిమా ఎన్నో రికార్డుల్ని బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో అంటే.. వన్స్ మోర్ అనాల్సిందే. అయితే సత్యదేవ్ సినిమాకీ టాప్ 10లో చోటు దక్కడం, అది కేవలం ఓటీటీలోనే విడుదల అవ్వడం విశేషం. `ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య`లో స్టార్స్ లేరు. పెద్ద పెట్టుబడీ కనిపించదు. కేవలం కథా బలంతో తీసిన సినిమా అది. అయినా సరే.. బన్నీ సినిమాతో పోటీ పడి మరీ టాప్ 10లో ఉండడం విశేషమే.