మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా 'తేజ్ ఐ లవ్‌యూ' చిత్రం ఆడియో ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారన్న సంగతి చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా కన్‌ఫామ్ చేసింది. ఈ నెల 9న జరగబోయే ఈ ఆడియో వేడుకను హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకకు చిరంజీవి వస్తున్నాడు సరే, మరి మేనల్లుడి కోసం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేయనున్నాడా? అంటే అవునంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడిగా జనయాత్రలో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో ఆడియో ఫంక్షన్‌కి వస్తాడా అంటే, ఇటీవల జరిగిన పలు ఆడియో ఫంక్షన్స్‌కి, సక్సెస్ మీట్స్‌కి పవన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ మాట కొస్తే, చిరంజీవి కన్నా, పవన్ కళ్యాణ్‌తోనే తేజుకి ఎటాచ్‌మెంట్ ఎక్కువ. అందుకే స్పెషల్‌గా చిన్న మేనమామని తేజు రిక్వెస్ట్ చేశాడట.
ఇదే కాదు, తేజు వైపు నుండి పవన్ రావడం ఓ ఎత్తైతే, డైరెక్టర్ కరుణాకరన్ వైపు నుండి కూడా పవన్‌పై ప్రెషర్ ఉందట. పవన్ సినిమాతోనే కరుణాకరన్ డైరెక్టర్ అయ్యాడు. పవన్‌తో కరుణాకరన్ తెరకెక్కించిన 'తొలిప్రేమ' సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సో ఆ రకంగా కూడా పవన్ ఈ ఫంక్షన్‌కి వచ్చే అవకాశాలున్నాయి.
మరోవైపు ఈ మధ్య మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి ఏదీ కలసి రావడం లేదు. సో ఇద్దరు మేనమామల సపోర్ట్‌తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట తేజు. కే.ఎస్.రామారావు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.