పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 న రిలిజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నార్త్ లో నిర్వహించారు. ఇప్పుడు సౌత్ లో చెన్నైలో ఆదివారం ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి టోటల్ టీమ్ అటెండ్ అయ్యారు. నిజంగా వైల్డ్ ఫైర్ అన్నట్టు జరిగింది ఈ వేడుక. దేవి శ్రీ మైత్రీ మేకర్స్ పై కామెంట్స్ చేయటం, రష్మిక పెళ్లి గూర్చి, రిలేషన్ గూర్చి ఓపెన్ అవటం. బన్నీ స్పీచ్ ఇలా చాలా విషయాలు ఈ వేడుకలో హైలెట్ గా నిలిచాయి.
అల్లు అర్జున్ స్పీచ్ ఓ రేంజ్ లో తమిళ తంబీలను ఆకట్టుకుంది. బన్నీ స్పీచ్ తమిళంలో అనర్గళంగా సాగింది. తమిళంలో మాట్లాడటమే తాను వారికీ ఇచ్చే గౌరవం అని బన్నీ తెలిపాడు. సుకుమార్ లేకపోతే తన కెరియర్ లేదని, సుకుమార్ లేకపోతే ఆర్య, పుష్ప లేడని తెలిపాడు. అలాగే దేవి శ్రీ గూర్చి కూడా పాజిటీవ్ గా మాట్లాడాడు. తన 20 సినిమాల్లో పదిటికీ దేవి సంగీతం ఇచ్చినట్లు తెలిపారు బన్నీ. అన్ని మ్యూజికల్ హిట్ అని సంతోషంగా పేర్కొన్నాడు బన్నీ.
ఈ ఈవెంట్ లో స్టేజిపై బన్నీ'పుష్ప పుష్ప' పాటకు డాన్స్ చేయటం గమనార్హం. ఫాన్స్ అరుపులు, కేకలు, చప్పట్లతో స్టేడియం మారుమోగిపోయింది. తమిళనాడులో 800 థియేటర్లలో 'పుష్ప 2 ది రూల్' సినిమా రిలీజ్ కావటం విశేషం. ఇదే ఈవెంట్ లో రష్మిక పెళ్లి ప్రస్తావన రాగా ఉహించని ఆన్సర్ ఇచ్చింది శ్రీవల్లి. మీరు ఇండస్ట్రీలో వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా, బయట వ్యక్తినా అని అడగా ఆ విషయం అందరికీ తెలిసిందే అని తేలిగ్గా తీసి పడేసింది. ఇదే ఈవెంట్ లో పుష్ప 2 స్పెషల్ సాంగ్ 'కిస్సిక్'ను కూడా రిలీజ్ చేసారు. శ్రీలీల కూడా స్టేజ్ పై డాన్స్ చేసింది.