మైత్రి మేకర్స్ పై దేవిశ్రీ చురకలు

మరిన్ని వార్తలు

పుష్ప2 మూవీ డిసెంబర్ 5 న ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్. ట్రైలర్ ఈవెంట్ ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించగా, ఇంకొక ఈవెంట్ ని ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ క్రమంలో దేవిశ్రీ స్టేజ్ పై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఇంత ఓపెన్ గా దేవిశ్రీ మైత్రీ మూవీ మేకర్స్ ని అనటం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. దేవిశ్రీ వచ్చిన వెంటనే రవి టైంకి రాలేదు లేట్ అన్నారట. దీనితో స్టేజ్ పైనే క్లారిటీ ఇస్తున్నా అని, ఇవన్నీ సపరేట్ అడిగే కంటే ఇలా ఓపెన్ గా అడగటమే బెటర్ అని, నేను ఎప్పుడూ అంతే ఓపెన్ అని కూడా పేర్కొన్నాడు దేవిశ్రీ.

దేవిశ్రీ స్టేజ్ పై మాట్లాడుతూ రవి సార్ స్టేజి ఎక్కి ఎక్కువ సేపు మాట్లాడావ్ అని నన్ను అనొద్దు. టైమ్‌కు పాట ఇవ్వలేదు, టైమ్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైమ్‌కు ప్రోగ్రాంకి రాలేదు లాంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయి మీకు. నా మీద రవి గారికి చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న చోటే  కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ, నా మీద రవి సర్ కి ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అని తన మనసులో ఆవేధన, అక్కసు లాంటివి అన్నీ బయటపెట్టేసారు దేవిశ్రీ. అంతే కాదు నేను ఎప్పుడూ ఆన్ టైమింగ్ అని కూడా స్పష్టం చేసాడు.

దీనికంతటికీ కారణం 'పుష్ప ది రూల్' మ్యూజిక్ విషయం అని తెలుస్తోంది. మొదటి పార్ట్ కి దేవిశ్రీ సంగీతం కూడా ప్లస్ అయ్యింది. పుష్ప 2 కోసం టైం సరిపోవటం లేదని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్, అజినీష్ లాంటి వారిని తీసుకున్నారని తెలిసిన విషయమే. దీనితో దేవిశ్రీ కి మైత్రీ మూవీ మేకర్స్ కి చెడింది అని ప్రచారం జరుగుతోంది. ఒక ఈవెంట్ లో స్వయంగా తమన్ చెప్పాడు నేనొక్కడినే కాదు ఇంకో ఇద్దరు కూడా పుష్ప 2  కోసం పని చేస్తున్నారని. దీనితో దేవి హర్ట్ అయ్యాడని, దీనికి కారణం అయిన మైత్రీ వారితో ఎడమొహం పెడ మొహంగా ఉంటున్నాడని తెలుస్తోంది. తాజాగా స్టేజ్ పై దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలుఈ వివాదానికి నిదర్శనం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS