టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు చాలా మంది హీరోలు. సినిమా సెలబ్రిటీలే కాకుండా స్పోర్ట్స్ స్టార్స్ కూడా వ్యాపారాలు చేసుకునే అలవాటు ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దీంతో చాలామంది సినిమాల్లో నటిస్తూనే మరోవైపు అనేక రకాల బిజినెస్ లు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు.
ఈ జాబితాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే పలు బిజినెస్ లు స్టార్ట్ చేసి లాభాలు గడిస్తున్న అల్లు అర్జున్ తాజాగా 'బీ-డబ్స్' అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ని స్టార్ట్ చేసాడు. హైదరాబాద్ లో తొలిసారిగా 'బి-డబ్స్' ను ఏర్పాటు చేసాడు. శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్ ఓపెన్ అయింది. దీనిలో అల్లు అర్జున్ కి భాగస్వామం ఉందని.. ఇన్వెస్టర్ కూడా ఈయనే అంటూ పోస్టర్ ని ప్రింట్ చేయటం విశేషం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.